`మాస్ట్రో`గా వ‌స్తున్న నితిన్‌..ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య `చెక్‌`తో ప్రేక్ష‌కులను ప్ర‌ల‌క‌రించిన నితి‌న్‌కు ఘోరంగా నిరాశ ఎదురైన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల `రంగ్ దే` సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్‌ను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం.

- Advertisement -

అయితే ఈ రోజు నితిన్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా నితిన్ 30వ సినిమా టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ చిత్రానికి ‘మాస్ట్రో ‘ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే.. ఇందులో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నారు నితిన్‌.

పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు సినిమాపై మ‌రింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మొత్తానికి ఈ పోస్ట‌ర్ అద్భుతంగా ఆక‌ట్టుకుంటుంది. కాగా, ఈ చిత్రంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share post:

Popular