ఆస‌క్తిక‌రంగా నితిన్ `మాస్ట్రో` ఫస్ట్‌ గ్లింప్స్!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో అంధాధున్ తెలుగు రీమేక్ ఒక‌టి. అయితే ఈ రోజు నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `మాస్ట్రో` ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో వ‌స్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

నితిన్ పియానో వాయిస్తూ ప్లెజెంట్ గా ప్రారంభం అయిన ఈ గ్లిమ్స్‌.. ఒక్కసారిగా హీటెక్కింది. ఓ పిల్ల పియానో మీద కాలు పెట్ట‌డం.. అంత‌లోనే అంధుడైన నితిన్‌ను ఎవ‌రో నీళ్ల బ‌కెట్‌లో ముంచేయ‌డం ఈ వీడియోలో చూపించారు. మొత్తానికి ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేసింది.

Share post:

Latest