ర‌ష్మికకు ఛాలెంజ్ విసిరిని నాగార్జున‌..బీట్ చేయ‌గ‌ల‌దా?

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ర‌క‌ర‌కాలుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే `వైల్డ్‌ డాగ్`‌ పుష్‌ అప్‌ ఛాలెంజ్ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా.. ముప్పై సెకెండ్ల పాటు పుష్‌అప్‌ పొజిషన్‌లో ఉంది. అనంత‌రం ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. తిరిగి వైల్డ్ డాగ్ యూనిట్‌కే ఛాలెంజ్‌ విసిరింది. ఇది గ‌మ‌నించిన నాగ్‌.. వెంట‌నే ర‌ష్మిక ఛాలెంజ్ స్వీక‌రించారు.

ఆయ‌న కూడా పుష్‌అప్‌ పొజిషన్‌లో ఒక నిమిషం ముప్పై సెకండ్ల పాటు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన నాగ్‌.. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్‌ విసిరారు. ‘యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్’‌ అంటూ తన పోస్ట్‌కి ర‌ష్మిక ఖాతాను ట్యాగ్‌ చేశారు. మ‌రి ఈ బిగ్ ఛాలెంజ్‌ను ర‌ష్మిక బీట్ చేస్తుందో లేదో చూడాలి.

Share post:

Latest