ఏప్రిల్ 1న మాధవ‌న్ రాకెట్రీ ట్రైల‌ర్ విడుద‌ల..!

ప్రముఖ స్టార్ హీరో మాధ‌వ‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయణ‌న్ ‌ బ‌యోపిక్ రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్‌ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. అటు తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వ‌చ్చింది. ఈ చిత్రం ల‌ర్ ను ఏప్రిల్ 1న రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్.

- Advertisement -

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ముఖ్య పాత్రలో న‌టిస్తున్నాడు. మాధ‌వ‌న్ అటు లీడ్ రోల్ లో డైరెక్ట‌ర్ గా, నిర్మాత‌గా ఈ చిత్రం వ‌స్తుండ‌టం మరో విశేషం. నంబి నారాయణ‌న్ త‌న స‌ర్వీసులు మొద‌లు పెట్టిన తొలిరోజుల్లో గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డిన‌ట్టు కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రి ఈ మూవీ ట్రైల‌ర్ లో మాధ‌వ‌న్ ఎలాంటి యాంగిల్ ను చూపనున్నాడో వేచి చూడాలి.

Share post:

Popular