ఒక్కో యాడ్‌కి త్రివిక్ర‌మ్ పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొదట చిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. `నువ్వే నువ్వే` అనే ప్రేమ కథా చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ట‌ర్న్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా చ‌క్రం తిప్పుతున్న త్రివిక్ర‌మ్‌..సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా తెర‌కెక్కిస్తుంటారు.

ఈయ‌న రూపొందించి ఎన్నో యాడ్స్ ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్నాయి. అందుకే సినిమాలే కాకుండా.. యాడ్స్ కూడా త్రివిక్ర‌మ్‌తోనే చేయాల‌ని అగ్ర హీరోలు ప‌ట్టుబ‌డుతుంటారు. ముఖ్యంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి స్టార్ హీరోలు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఎక్కువ యాడ్స్ చేశారు.

అయితే సినిమాల‌కు ఇర‌వై కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే త్రివిక్ర‌మ్‌.. యాడ్స్‌కు కూడా భారీగానే తీసుకుంటార‌ట‌. ఈయ‌న ఒక్కో యాడ్‌కు రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఒక్కరోజు షూటింగ్ కోసమే అంత తీసుకోవడం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

Share post:

Latest