” ఖైదీ నెంబ‌ర్ 150 ” క‌ర్ణాట‌క డీల్ కుమ్మేసింది

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’పై ఇండ‌స్ట్రీలో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో యేడాదిగా చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌ల‌కు యూ ట్యూబ్‌లో రికార్డులు ప‌గులుతున్నాయి. పెరిగిన భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మ లేపేస్తోంది. తాజాగా కర్ణాటకలో సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ రేటు చిరు కేరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిచింది.

చిరు ద‌శాబ్దం త‌ర్వాత హీరోగా వెండితెర‌పై క‌నిపిస్తుండ‌డంతో క‌న్న‌డ నాట ఉన్న మెగా అభిమానుల‌తో పాటు అక్క‌డ తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఖైదీ క‌న్న‌డ రైట్స్ రూ 8.5 కోట్ల‌కు అమ్ముడైన‌ట్టు స‌మాచారం.

మెగా ఫ్యామిలీ క్రేజీ హీరోలు పవన్ కళ్యాణ్‌, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ ఆ స్థాయిలో అమ్ముడవ్వలేదు. ఇక ఓవ‌రాల్‌గా ఖైదీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.75 కోట్ల మేర వ్యాపారం చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు చిరు సినిమాలేవి రూ.40 కోట్ల మార్క్ ట‌చ్ చేయ‌లేదు.

అయితే 2007 మార్కెట్‌కు ఇప్ప‌టి మార్కెట్‌కు చాలా తేడా వ‌చ్చేసింది. ఈ ప‌దేళ్ల‌లో తెలుగు సినిమా మార్కెట్ ప‌రిధి బాగా విస్త‌రించింది. టిక్కెట్ల రేట్లు డ‌బుల్ అయ్యాయి. ఇక సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఇవ‌న్నీ క‌లిపి ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగేలా చేస్తున్నాయి.