ఎన్టీఆర్ – బాబి సినిమాకు టైటిల్ ఫిక్స్‌

మూడు వ‌రుస హిట్ల త‌ర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ సినిమా వ‌చ్చే నెల‌లో సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టుల‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సీడెడ్ రైట్స్ కోసం టాలీవుడ్ హిస్ట‌రీలో సీడెడ్‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు రాని బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ ఓ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్ ఏకంగా రూ 14.75 కోట్లు ఆఫ‌ర్ చేశాడ‌ట‌.

ఈ వార్త ఇలా ఉండ‌గానే అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ‘నట విశ్వరూపం’….ఇదే ఆ టైటిల్. ఆల్రెడీ విశ్వరూపం పేరుతో కమల్ హాసన్ విశ్వరూపాన్ని చూసేశాం. ఇప్పుడు ఎన్టీఆర్ న‌టవిశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నాం. మ‌రి ఫైన‌ల్‌గా ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా ? మ‌ళ్లీ మారుతుందా ? అన్న‌ది చూడాలి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్ అవ్వ‌గా, ఐటెం సాంగ్ కోసం మ‌రో హీరోయిన్‌ను సైతం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకు స్వ‌రాలందిస్తున్నాడు.