అనుష్కకు కాబోయే భ‌ర్త ఆస్తులు ఇవే

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర కాలంగా మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిల‌ర్ హీరోతో ఆమె డేట్‌లో ఉంద‌ని, వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ రూమ‌ర్లే అని తేలిపోయాయి.

ప్ర‌స్తుతం ఆమె న‌టించిన ఎస్‌-3తో పాటు బాహుబ‌లి 2 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇక అనుష్క‌కు ఇప్ప‌టికే 36 ఏళ్లు వ‌చ్చేశాయి. ఆమెకు పెళ్లి చేసేసేయాల‌ని ఆమె త‌ల్లిదండ్రులు డిసైడ్ అయిపోయార‌ట‌. ఈ క్ర‌మంలోనే అనుష్క‌కు వ‌రుడిని చూసేశార‌ని… అనుష్క‌కు కాబోయే భ‌ర్త బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అని తెలుస్తోంది.

అనుష్క పెళ్లి ఫిక్స్ అయ్యింద‌న్న వార్త‌లు గ‌త రెండు రోజులుగా మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక అనుష్క‌కు కాబోయే వ‌రుడికి చాలా వ్యాపారాలు ఉన్నాయ‌ట‌. అత‌డికి ఆంధ్రా, తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌తో పాటు క‌ర్ణాట‌క‌, బెంగ‌ళూరు న‌గ‌రంలో చాలా వ్యాపారాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

వీరి పెళ్లి 2017లో జ‌రిపేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. ఏదేమైనా బొమ్మాళి పెళ్లిపై ఎన్ని రూమ‌ర్లు ఉన్నా…వీటిపై ఆమె క్లారిటీ ఇస్తేనే ఈ వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డుతుంది.