రేటు పెంచేసిన కుమారి

బెల్లం చుట్టూ ఈగ‌లు ఉన్న‌ట్టే ఎక్క‌డైనా స‌క్సెస్ చుట్టూనే అంద‌రూ తిరుగుతూ ఉంటారు. ఈ నానుడి సినీ ఇండస్ట్రీకి నూటికి నూట‌యాభై శాతం వ‌ర్తిస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు హిట్లు కొడుతుంటూ వారికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలో హీరోలు, ద‌ర్శ‌కుల‌కు లాంగ్ ర‌న్ ఉంటుంది కాబ‌ట్టి వారు ఎప్పుడైనా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.

హీరోయిన్ల ప‌రిస్థితి అలా కాదు…వారికి క్రేజ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి. వారికి గ్లామ‌ర్ ఉన్నంత కాల‌మే ఛాన్సులు వ‌స్తాయి. త‌ర్వాత వారు అవుట్ డేటెడ్ హీరోయిన్లుగా మిగిలిపోతారు. ఈ క్ర‌మంలోనే వారు ఒక‌టి రెండు హిట్లు ప‌డ‌గానే త‌మ రేటును అమాంతం పెంచేస్తారు.

ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సైతం ఇదే సూత్రాన్ని బాగా వంట ప‌ట్టించుకుంద‌ట‌. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకుని కుర్రకారు గుండెల్లో హాట్ ఇమేజ్ ఏర్ప‌రుచుకున్న హెబా ప‌టేల్‌. ఆమె తొలి సినిమా అలా ఎలాకు అస‌లు రెమ్యున‌రేష‌న్ లేద‌ట‌.

కుమారి 21 ఎఫ్ సినిమాకు రూ.5 ల‌క్ష‌లు కూడా లేద‌ట‌. ఆ త‌ర్వాత ఈడోరకం ఆడోరకం – తాజాగా  ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్‌తో ఆమె త‌న రేటును ఏకంగా రూ.60 ల‌క్ష‌ల‌కు పెంచేసింద‌ట‌. రూ. 60 ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌ అయితే అస‌లు మాట్లాడే ప‌రిస్థితి లేద‌ని…నిర్మాత‌ల‌కు ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌.  వామ్మో నాలుగు సినిమాల‌కు హెబా బాగా ముదిరిపోయిందే అన్న టాక్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వినిపిస్తోంది.