జ‌గ‌న్‌లో ఇంత డెప్త్ ఉందా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అనేక మంది నేతలు త‌మ స్పంద‌న‌ను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు కూడా త‌మ రీతిలో స్పందించారు. ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్ స్పందించ‌డం లేద‌ని కూడా ఈ నేత‌లు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దుపై  వైకాపా అధినేత జ‌గ‌న్ స్పందించారు. అయితే, ఆ స్పంద‌న అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మ‌నం చెప్పుకోవాల్సిన విష‌యం ఉండేది కాదు. పెద్ద నోట్ల ర‌ద్దుపై అదిరిపోయే రేంజ్‌లో జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. అయితే, ఆయ‌న ఎక్క‌డా ఎవ్వ‌రి మీదా ఫైర్ అవ‌లేదు స‌రిక‌దా.. నిర్ణ‌యాన్ని కూడా త‌ప్పుప‌ట్ట‌లేదు.

అంతేకాదు, జ‌గ‌న్ ఈ పాయింట్‌లోని అనేక అంశాల‌ను వెలుగులోకి తెచ్చారు. ఆయ‌న చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టి చూస్తే.. ఈ నోట్ల ర‌ద్దుపై జ‌గ‌న్ పూర్తిస్థాయిలో లోతైన అధ్య‌య‌న‌మే చేసిన‌ట్టు తెలుస్తోంది. అలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ప్రతిపక్షాలను సంప్రదించడం సామాన్యులను సంప్రదించడం చేస్తే ఎంతో బాగుండేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయకపోవడమే పెద్ద లోపమని… అందుకే ఈ ఇబ్బందులని చెప్పారు. ఎంతో పకడ్బందీగా అమలు చేయాల్సిన ఈ నిర్ణయం ముందే కొందరికి తెలియడమన్నది పెద్ద లోపమని తేల్చారు.

 చంద్రబాబు వంటి కేంద్రంతో మంచి సంబంధాలున్నవారికి ముందే తెలియడంతో వారు అంతా సర్దుకున్నారని… దానివల్ల మోడీ లక్ష్యం ఆదిలోనే దెబ్బతిందని చెప్పారు. అదేస‌మ‌యంలో జ‌నాలు ప‌డుతున్న ఇబ్బందుల‌ను సైతం జ‌గ‌న్ వెలుగులోకి తెచ్చారు.  దేశంలోని 6 లక్షల 38 వేల  గ్రామాలు క్యాష్ ఎకానమీపైనే నడుస్తున్నాయని, ఇప్ప‌టికిప్పుడు వీరిని డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ వైపు మ‌ళ్ల‌మ‌ని చెబితే సాధ్య‌మేనా ? అని ప్ర‌శ్నించారు. 53 శాతం జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని… దేశంలో ఉన్న ఏటీఏంలలో పదిశాతం కూడా గ్రామాల్లో లేవని.. వివ‌రించారు.

 గతంలో పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. క్యాష్ లెస్ ఎకానమీని సమాజంలో వ్యాప్తించెందించాలంటే ముందుగా ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని చెప్పారు. ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తొలుత సమర్థించి తరువాత ప్లేటు మార్చిన చంద్రబాబుపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. ఏటీఎంల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలని జగన్ డిమాండు చేశారు.  దీంతో జ‌గ‌న్ స్పందించ‌లేదు.. స్పందించ‌లేదు అన్న వారు ఇప్పుడు.. మాత్రం జ‌గ‌న్ డెప్త్ స్పీచ్‌కి అవాక్క‌వుతున్నార‌ట‌!!