రానాకు వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్

బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల‌దేవుడిగా భ‌య‌పెట్టిన ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా బాహుబలి-2 షూటింగ్ కూడా ఫినిష్ ద‌శ‌కు వ‌చ్చేయ‌డంతో మ‌నోడు ఫ్రీ అయిపోయాడు. భ‌ళ్లాల‌దేవుడు ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. ఘాజీ సినిమాలో న‌టిస్తున్న రానా ఆ సినిమా షూటింగ్‌ను సైతం ఫినిష్ స్టేజ్‌కు తెచ్చేశాడు.

ఇక ఇప్పుడు తేజ డైరెక్ష‌న్‌లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రానా తండ్రి, అగ్ర నిర్మాత సురేష్‌బాబు సొంతంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి రానా త‌న తండ్రి సురేష్‌బాబుతో క‌లిసి ఓ సెల్ఫీ దిగిన రానా ఈ నిర్మాత గారితో మొద‌టి సారిగా ఓ సినిమా చేస్తున్నాను…ఇంత‌కు ఆయ‌న మా నాన్నే..త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు వివ‌రాలు చెపుతాన‌ని త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఇక ఈ పోస్టుకు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ రానాకు ఓ వార్నింగ్‌లా ఇచ్చారు. చిన్న స‌జెష‌న్ అనుకో… లేదా హెచ్చ‌రిక అనుకో తండ్రులంద‌రూ చాలా ట‌ఫ్ బాసులే..నువ్వు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. దీనికి వెంట‌నే రియాక్ట్ అయిన రానా అలాగే సార్‌… ఒప్పుకుంటున్నాను..నాకు అర్థ‌మైంది. ఫాలో అవుతాన‌ని రిప్లే ఇచ్చాడు. అది మొత్తానికి సురేష్‌బాబు విష‌యంలో కొడుకుగా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని..కేటీఆర్ రానాకు చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా స‌ల‌హా ఇచ్చార‌న్న‌మాట‌.