ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబ ఆస్తుల‌ను ఆయ‌న కుమారుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ బాబు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఇలా పొలిటిక‌ల్‌గా ఓ రేంజ్‌లో ఉన్న నేత త‌న కుటుంబ ఆస్తులు ప్ర‌క‌టించ‌డం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వ‌రుస‌గా ఎనిమిదోసారి ప్ర‌క‌టించండం గ‌మ‌నించాల్సిన విషయం. ఇక‌, లోకేష్ చెప్పిన దానిని బ‌ట్టి.. చంద్రాబాబు, ఆయ‌న కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్ర‌మే ఆధారంగా క‌నిపిస్తోంది. దీంతో తాము ఈ బిజినెస్‌పైనే కాన్సంట్రేష‌న్ చేశామ‌ని, దీనిని అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని లోకేష్ చెప్పారు. హెరిటేజ్‌ను ప్రారంభించి 24 ఏళ్లు అయ్యిందన్నారు. గత ఏడాది హరిటేజ్ టర్నోవర్ రూ.2381కోట్లు అని ఆదాయం రూ.55కోట్లుగా తెలిపారు. హెరిటేజ్ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉంద‌న్నారు. ఇక‌, మిగిలిన ఆస్తుల వివ‌రాలు.. ఇవీ..

చంద్రాబాబు పేరిట ఉన్న ఆస్తులు….

– హైద‌రాబాద్‌లోని నివాసం విలువ రూ.3 కోట్ల 68 ల‌క్ష‌లు

– అంబాసిడ‌ర్ కారు రూ.ల‌క్షా 52 వేలు.

– ఖాతాలోని న‌గ‌దు రూ.3 ల‌క్ష‌ల 59 వేలు

–  బ్యాంకు రుణం రూ3 కోట్ల 6 ల‌క్ష‌లు

—————————————————-

మొత్తం నిక‌ర ఆస్తులు రూ.6 కోట్ల 7 ల‌క్ష‌లు

—————————————————–

బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న‌వి..

– పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 73 ల‌క్ష‌లు

– త‌మిళ‌నాడులోని భూమి విలువ రూ.కోటి 86 ల‌క్ష‌లు

– మ‌దీనాగూడ‌లోని భూమి విలువ రూ.73 ల‌క్ష‌లు…

– హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ రూ.19 కోట్ల 95 లక్ష‌లు

– వివిధ కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3 కోట్ల 28 ల‌క్ష‌లు

– భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్ష‌లు

– భంగారు ఆభ‌ర‌ణాల విలువ రూ.కోటి 27 ల‌క్ష‌లు

– కారు విలువ రూ.91 ల‌క్ష‌లు

———————————————————————————-

– భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.38కోట్ల 66ల‌క్ష‌లు

————————————————————————————-

* అప్పులు రూ.13 కోట్లు

ఇక లోకేష్ త‌న కుమారుడు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల‌ను కూడా వెల్ల‌డించారు. దేవాన్ష్ పేరిట రూ.11.32కోట్ల ఆస్తులు ఉన్నట్లు లోకేష్ వెల్లడించారు. అలాగే దేవాన్ష్ పేరిట రూ.2.04 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశామన్నారు.

 దేవాన్ష్ ఆస్తుల వివరాలు….

– జూబ్లీహిల్స్‌లో ల్యాండ్ రూ.9.17కోట్లు

–  బ్యాంక్ అకౌంట్‌లో నగదు రూ.2లక్షలు

–  వెండి ఉయ్యాల రూ.3లక్షలు

– భువనేశ్వరి నుంచి దేవాన్ష్‌కు రూ.9.20కోట్ల ఆస్తి బదిలీ

–  తాతయ్య(బాలకృష్ణ) బహుమతి : రూ.2.04కోట్లు