70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్‌ఖాన్‌.

విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇటీవల ‘సుల్తాన్‌’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్‌ సెన్సేషన్‌ రాబోతోంది. అదే ‘టైగర్‌ జిందా హై’. ఇందులో సల్మాన్‌ఖాన్‌ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. 2017 డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ చిత్రంలో ఇండియన్‌ ఏజెంట్‌గా, పాకిస్తాన్‌లో భారత గూఢచారిగా కనిపిస్తాడు సల్మాన్‌ఖాన్‌. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్‌ ‘టైగర్‌ జిందా హై’ సినిమాలో సల్మాన్‌తో జతకట్టడం మరో విశేషం. వరుస విజయాలతో దూసుకెళ్లిపోతోన్న ఈ కండలవీరుడికి ‘టైగర్‌ జిందా హై’ సినిమా మరో భారీ విజయం తెచ్చిపెడుతుందని బాలీవుడ్‌ వర్గాల అంచనా. ఈ సినిమా కోసం సల్మాన్‌ ముసలి క్యారెక్టరే కాకుండా, అనేక న్యూ గెటప్స్‌ ట్రై చేస్తున్నట్లు సమాచారమ్‌. ఇంతవరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లో సల్మాన్‌ ఈ సినిమాలో కనిపించనున్నాడట. సల్మాన్‌ఖానా మజాకానా!