పారితోషకంతో షాక్ ఇస్తున్న అవసరాల

టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఒకసినిమా హిట్ కొడితే చాలు వాళ్ళ ఆదాయానికి హద్దులుండవు. ప్రస్తుతం వున్న టాలీవుడ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్లో ముందుండే మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి, ఆ తరువాత స్తానం లో త్రివిక్రమ్,కొరటాల వంటివారు వున్నారు.

ఇప్పుడు ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్‌ చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్‌. అంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే సినిమా కూడా మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడు ఆయన నేచురల్‌ స్టార్‌ నానితో మూడో సినిమా చేస్తున్నాడు. 2017లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి వరుస గా హిట్లు కొడుతున్న అవసరాల పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

అవసరాల డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే కోసం ఆయన నెల జీతం తీసుకొని పనిచేశాడట. ఆవిధంగా ఆ సినిమా పూర్తయ్యే సమాయానికి ఆయనకొచ్చిన పారితోషకం 15 లక్షలట. ఇక, రెండో సినిమా ‘జ్యో అచ్చుతానంద’ సినిమాకు తీసుకున్న పారితోషకం రూ.60 లక్షలట. ఇక ఇప్పుడు త్వరలో నానితో తెరకెక్కించబోయే సినిమాకు ఏకంగా 2.5 కోట్ల రూపాయలు అందుకోనున్నాడట. విశేషమేమిటంటే ఈ మూడు సినిమాలకూ నిర్మాత సాయికొర్రపాటే. అవసరాలలోని టాలెంట్‌ను గుర్తించిన సాయి కొర్రపాటి ఆయన రెమ్యునరేషన్‌ను సినిమా సినిమాకు నాలుగు రెట్ల చొప్పున పెంచేస్తున్నాడట.