పాక్‌పై మోడీ కొత్త యుద్ధం

భార‌త్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కొత్త యుద్ధం ప్ర‌క‌టిస్తున్నారా ? బుల్లెట్ పేల‌కుండానే పాకిస్తాన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ రెడీ అవుతున్నారా ? జ‌లాస్త్రంతో పాకిస్తాన్‌కు మోడీ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ? అంటే అవున‌నే స‌మాధానాలు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా వ‌స్తున్నాయి.

గ‌త ఆదివారం జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన మార‌ణ‌హోమంలో 18 మంది మ‌న జ‌వాన్లు వీర మ‌ర‌ణం పొంద‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌-పాకిస్తాన్ సంబంధాలు మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పాక్ చేసిన తాజా దాడి 130 కోట్ల మంది భార‌తీయుల ర‌క్తాన్ని మ‌రిగించేస్తోంది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకిస్తాన్‌కు తెర‌వెన‌క స‌పోర్ట్ చేసే పెద్ద దేశాలు సైతం పాక్ చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పు బ‌డుతున్నాయి.

ఇదిలా ఉంటే భార‌తీయులు మాత్రం ఈ విష‌యంలో ఊరుకునేలా లేరు. పాక్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ చాలా మంది ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ విష‌యంలో మోడీ ఓ స‌రికొత్త యుద్ధం ద్వారా పాక్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. పాక్‌పై యుద్ధం చేయ‌కుండానే…. ఒక్క చిన్న బుల్లెట్ కూడా పేల్చ‌కుండానే…తుపాకులే ఎక్కు పెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా పాక్‌కు కంట్రోల్లోకి తెచ్చేందుకు ఆయ‌న ప్లాన్ వేస్తున్నార‌ని స‌మాచారం.

భార‌త్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో పంచ‌నదులు ప్ర‌వ‌హిస్తుంటాయి. సింధూ న‌దితో పాటు దీని ఉప‌న‌దులు అయిన జీలం-చినాబ్‌-బియాస్‌-రావి-స‌ట్లెజ్ న‌దులు ఈ స‌రిహ‌ద్దులో ప్ర‌వ‌హిస్తుంటాయి. దాదాపు 56 సంవ‌త్స‌రాల క్రితం ఈ రెండు దేశాల మ‌ధ్య సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం జ‌రిగింది. ఈ ఒప్పందం ప్ర‌కారం 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఈ ఒప్పందం ప్ర‌కారం పంచ‌న‌దుల్లో బియాస్, రావి, సట్లేజ్ నదులపై భారత్‌కు హక్కులున్నాయి. జమ్ము కాశ్మీర్‌నుంచి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు కంట్రోల్ ఉంటుంది.

ఇప్పుడు మోడీ ఈ ఒప్పందాన్ని పాక్‌కు చెప్ప‌కుండానే ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. అదే జ‌రిగితే పాక్‌కు నీరు వెళ్ల‌దు. 80 శాతం జ‌లాల‌పై ఉన్న పాక్‌లో ల‌క్ష‌లాది ఎక‌రాలకు నీళ్లు లేక‌… పంట‌లు పండ‌క పాక్ ఎడారిగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో మోడీ స‌ర్కార్ ఈ ఒప్పందాన్ని నిర్దాక్షిణ్యంగా ర‌ద్దు చేసుకుని ఈ జ‌లాస్త్రం ద్వారా పాక్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.