పవన్ కెసిఆర్ కలవబోతున్నారోచ్

అవును జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యణ్, తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారు.. అయితే రాజకీయంగా మాత్రం కాదు.. ఇద్దరి రాజకీయ దారులు వేరు..ఒకరేమో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా పార్టీ ని స్థాపించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రయితే..ఇంకొకరేమో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పోరాడుతామంటున్న నాయకుడు.

ఈ ఇద్దరి రాజకీయ లక్షాలు వేరైనా..ఇద్దరి కలయిక మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం జాగ్వార్ ఆడియో విడుదల వేడుకలో ఈ ఇద్దరు కాలవ బోతున్నట్టు సమాచారం.ఇప్పటికే ఈ విషమై కుమార స్వామి పవన్ ని,కెసిఆర్ ని కలిసి ఆహ్వానించగా ఇద్దరూ సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 75 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 18 న నిర్వహించనున్నారు.అంతా అనుకున్నట్టు జరిగితే పవన్ కెసిఆర్ లు ఒకే వేదికపైకి రాజకీయేతరంగా కలవబోతున్నారన్నమాట.ఎంతైనా రెండు విభిన్న ధ్రువాల కలయిక అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.