టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు జీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే టీవీ 9 పేరుతో న్యూస్‌ చానల్ నడిపిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎబిసిఎల్‌)లో శ్రీని రాజు ప్రధాన వాటాదారుగా ఉన్నారు. జీ గ్రూప్‌ ఎబిసిఎల్‌ 850 కోట్లకు కొనటానికి ఆఫర్ చేసినట్టు సమాచారం.

ఎబిసిఎల్‌ టీవీ 9, జై తెలంగాణ పేరుతో న్యూస్ చానెల్స్ నే కాకా మరాఠి, కన్నడ,ఇంగ్లీష్, గుజరాత్ ఇలా మొత్తం 7 చానెల్స్ ని నిర్వహిస్తుంది. ఈ మొత్తం చానెల్స్ తో సహా ఎబిసిఎల్‌ ని కొనడానికి జీ గ్రూప్‌ ఇంట్రెస్టేడ్ గ ఉందని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలోనే టెన్‌ స్పోర్ట్స్‌ను జీ గ్రూప్‌ సోనీకి 2,500 కోట్ల రూపాయలకు విక్రయించింది.