‘క్రాక్’ రవితేజకేనా ?

టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ఏమైనా చేయించారా అన్నది అస్పష్ట విషయం. ఇక, ఆ సినిమా కాకపోయుంటే ఓ మంచి సబ్జెక్టు రవితేజకు దొరికిందని, ఆ సినిమా కోసం అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఆ టైటిల్‌ను రవితేజకే రిజిస్టర్ చేసినట్టైతే అతడికి తగ్గట్టు మాస్ మసాలా టైటిల్ పడ్డట్టే.సినిమాలకు చిత్ర విచిత్రమైన టైటిల్స్ సెట్ చేయడంలో మాస్ మహరాజ్ రవితేజకు పెద్ద ట్రాక్ రికార్డే ఉంది. ఈడియట్.. ఖతర్నాక్.. బలుపు.. దరువు.. కిక్.. మిరపకాయ్.. లాంటి టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు ఈ క్రాక్ వెరైటీ టైటిల్‌కి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బెంగాల్ టైగర్ సక్సెస్ అయినా.. 9 నెలల నుంచి ఖాళీగానే ఉన్న రవితేజ.. ఇప్పుడు బాబీతో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. పవన్ సర్దార్ తో డీలా పడ్డ పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడంతో.. బాబీ కూడా రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేసేస్తున్నాడట. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రానున్న మూవీకి ‘క్రాక్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఓ కొరియన్ మూవీని అడాప్ట్ చేసుకుని.. లోకల్ వెర్షన్ ని రాసుకుంటున్నారట. ఇందులో రవితేజ కేరక్టర్ పవర్ ఫుల్ గానే కాదు.. ఫుల్లు ఫన్నీగా ఉంటుందని అంటున్నారు.