కుక్క కావాలి:చంద్ర బాబు

చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు.

దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ పాట్లు అన్ని ఇన్ని కావు.మనమంతా తేజ డైరెక్ట్ చేసిన ‘చిత్రం’ సినిమా చూసాం కదా..అందులో ఒక చిన్న బాబు ఓ కుక్కను చూసి అది కావాలంటూ పట్టుబట్టడం..తీరా ఆ బాబుని దాన్నుండి మరల్చడానికి అందరూ కలిసి ఆడి, పాడినా చివరకు ఆ బాబు పాటవ్వగానే కుక్క కావాలి అంటూ ఏడవటం మనకు నవ్వు తెప్పిస్తుంది.అచ్చం ఇలాగే ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ప్రత్యేక హోదా విషయం లో వ్యవహరిస్తున్నారు.

కేంద్రం నీచంగా ప్రత్యేక హోదా అదిగో ఇదిగో అంటూ..చూస్తాం..చేస్తాం అంటూ వచ్చి నిన్నటికి పరిశీలించే మాటని పక్కనబెట్టి కుదరదు అని చెప్పింది.మన బాబు గారు మాత్రం నీచాతి నీచంగాగా..నీచానికి పరాకాష్ట ఇది అనేంత దారుణంగా…మేము ఇప్పటికీ ప్రత్యేక హోదానే కోరుతున్నాం..అయితే కేంద్రం ఇస్తానన్న వాటిని తీసుకుంటాం.రావాల్సిన వాటికోసం పోరాడుతూనే ఉంటాం..రాష్ట్రం చాలా కష్టాల్లో వుంది..ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి మా వైఖరి స్పష్టం అంటూ..చెప్పాల్సిన బొంకు రామాయణం అంతా చెప్పి చివర్లో బాబు కుక్క కావాలి అన్న చందాగా ఈ బాబు గారు ప్రత్యేక హోదానే కోరుతున్నాం అంటే..బాబుగారిని ఏమనాలి.

అసలు ఇక్కడ బాబుగారు అండ్ భజన చేసే వితండ వాదం భలే గమ్మత్తుగా ఉంటుందండోయ్..అదేంటో తెలుసా..మేము ఎప్పుడైనా ప్రత్యేక హోదా వద్దన్నామా..మొదటి నుండీ అదే కోరుతున్నాం..ఇప్పటికీ అదే కోరుకుంటున్నాం..కామెడీ ఏంటంటే..కోరుకుంటే దక్కే పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అన్న అంశం లేదు..కేవలం పోరాడితేనే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్నీ బాబుగారికి అండ్ భజన మీడియా కి ఏ భాషలో చెప్తే అర్థం అవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఒకటి మాత్రం క్లియర్..బాబు గారు గంప గుత్తగా ఢిల్లీ లో తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేసాడు.ఇంకో రెండున్నరేళ్ల పాటు కేంద్రం ముందు సాగిలా బడి వాళ్ళను ఇలాగే యాచిస్తూ..దేహి దేహి అంటూ వాళ్ళు విదిల్చే మెతుకుల కోసం ఎదురు చూస్తూనే వుంటారు బాబుగారు. దానికి భజన చేస్తూనే ఉంటారీ భజన మీడియా.ఇక్కడ విచిత్రం ఏంటంటే..మనం సాక్ష్యం గా లేని చరిత్ర ని ,పురాణాయాల్ని పుస్తకాల్లో చూసి అదే నిజమని నమ్ముతూ వస్తున్నాం.మన కళ్ళముందు సాక్షాత్కరిస్తున్న ఈ నయ వంచనని కూడా బాబు అండ్ భజన బ్యాచ్ ఎంత చక్కగా మేడిపండు తీరున..మసి పూసిన మారేడు కాయ చందాగా..చిత్త శుద్ధికి కేర్ అఫ్ అడ్రస్ వీళ్ళే అన్నట్టుగా చలామణి అవుతూ..చరిత్రలో సచ్చీలురు అంటే మేమె అనేంతగా నమ్మిచే ప్రయత్నం నిస్సిగ్గుగా జరుగుతూనే వుంది..ఇక్కడ కామెడీ ఏంటంటే..ప్రత్యక్షంగా చూస్తున్న మనకే ఏది వాస్తవమో ఏది కాదో,ఏది చిత్త సుద్దో ఏది నయవంచనో తెలీకుండా మూకుమ్మడిగా చెప్పిన అబద్దాన్ని ..మోసాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి నిజాన్ని ఖునీ చేసే జిగుప్సయాకరమైన ప్రయత్నం జరుగుతూనే వుంది..ఇక ఇదే కొనసాగుతూ పోతే భావితరాలకు నిజానిజాలు తెలిసే అవకాశం కాదు కదా..అసలు అబద్దం అన్న అనుమానం కూడా రాదు..అంత పకడ్బందీ వంచన జరుగుతోందిరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో.