6 కాదు ఈ సారి 8 అంటున్న బన్నీ!

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి తనలో వేరియేషన్ చూపించడం.. కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పేశాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా..ఇందు తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. దేశముదు టైమ్ లోనే అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చూపించేశాడు. అందుకే ఈసారి 8ప్యాక్‌ను తెరపై ఆవిష్కరించనున్నాడట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఫ్రెండ్ షిప్ రోజున క్రిష్ పెళ్లితోపాటు అంతకు మందురు రోజు జరిగిన ఈవెంట్స్ లో బన్నీ గెటప్ చూస్తే ఇదే అనిపించక మానదు.

ఫిట్నెస్‌లు చేసి చేసీ అల్లు అర్జున్ బాడీని బాడీ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసేసిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. అయినా.. స్టైలిష్ స్టార్ సినిమాకో లుక్కు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకోటి రెడీ చేసేస్తున్నాడన్న మాట.