హాలీవుడ్ దీపికా మరీ ఇంతగానా

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ‘ట్రిపుల్ ఎక్స్-ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ మూవీతో హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అందాల రాశి ప్రముఖ పత్రిక..వానిటీ ఫెయిర్‌లో చోటు సంపాదించింది. హాలీవుడ్ నెక్స్ట్‌ జెనరేషన్ చిత్రంగా వానిటీ ఫెయిర్ దీపిక చిత్రాన్ని ప్రచురించింది.

వానిటీ పత్రిక పబ్లిష్ చేసిన దీపిక ఫొటో చూసి అంతా అదరహో అంటున్నారు. రెడ్‌ డ్రస్‌లో.. కార్‌ దిగుతున్న ఆమె పిక్చర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డ్రస్‌ను ప్రముఖ డిజైనర్ హౌజ్ గూచి రూపొంచింది. ఈ మ్యాగజైన్‌లో దీపిక అభిరుచులు, లక్ష్యాలను కూడా ప్రచురించారు. ఓ ప్రశ్నకు.. “చీర లేదా గౌను.. రెండింటిలో ఏది ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే.. చీరే ధరిస్తాను” అని చెప్పింది మన దేశీ బ్యూటీ. వానిటీ ఫెయిర్ తాజా ఎడిషన్‌లో ప్రముఖ హాలీవుడ్ నటీమణుల మధ్య దీపిక చిత్రం పబ్లిష్ కావడం విశేషం.