స్టయిలిష్‌ స్టార్‌కు మల్లు చానల్‌ సపోర్ట్

అల్లు అర్జున్‌ను స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. మరి ఈ స్టైలిష్ స్టార్‌కు కేరళ లో కూడా ఫాలోయింగ్ బాగానే వుంది అది ఏ రేంజ్ లో అంటే మల్లు అర్జున్ అని పిలుసుకునేంతగా వుంది అక్కడ మనోడికి ఫాలోయింగ్. ఏషియానెట్ అనే కేరళ న్యూస్ చానెల్ మన సరైనోడికి ఒక బిరుదునిచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలనుకుంది.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో అవార్డుల ఫంక్షన్లతో సందడి చేసే ఈ చానల్ వారు.. బన్నీకి ఓ బిరుదిచ్చి తమ అభిమానాన్ని చాటారు. ఇంతకీ బన్నీకి ఇచ్చిన బిరుదేంటో తెలుసా..? ప్రవసి రత్న! ఇక, ఆ బిరుదు ఎందుకిచ్చారంటే.. బన్నీ సినిమాలకు ఇక్కడే కాదు కేరళలోనూ మంచి క్రేజ్ ఉంది.  అక్కడి ప్రేక్షకుల ఆదరణ, బన్నీ సినిమాలు ఆడే తీరు చూసిన సదరు చానెల్ వారు ప్రవసి రత్న పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు.

ఓ తెలుగు హీరో పక్క రాష్ట్రంలో ఇంత మంచి పేరు తెచ్చుకోవడం తెలుగు సినీ ఇండ్రస్టీకి గర్వకారణమే. ఇక, మలయాళంలో డైరెక్ట్‌గా ఓ సినిమా చేస్తానన్నాడు బన్నీ. మరి ఈ అవార్డు తర్వాత స్టైలిష్ స్టార్ మలయాళీ సినిమా వస్తుందేమో వేచి చూడాలి.