సింధు బ్రాండ్ వేల్యూ తెలిస్తే షాకె

ఈరోజుల్లో స్పోర్ట్స్ మెన్స్ కి, సినిమా వాళ్ళకి వున్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎవరైనా ఒక్క సినిమాలో మంచి గుర్తింపుతెచ్చుకుంటే చాలు వాళ్లకి సినిమాలలో వచ్చే ఆదాయంకంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందు కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇదే స్పోర్ట్స్ స్టార్స్ కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు.

స్పోర్ట్స్ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించే . ఆయన బ్రాండ అంబాసిడర్ గా చాల కంపెనీలకే చేశారు దాని తాలూకు ఆయనకు వచ్చిన ఆదాయం వందలకోట్లలోనే వుంది. ఆతరువాత ధోనికి ఆరేంజ్ లో బ్రాండ అంబాసిడర్ గా పేరుంది ఒకానొక స్టేజి లో బ్రాండ్ అంబాసిడర్ గా ఆదాయం లో సచిన్ ని కూడా దాటేశాడు ధోని. కోహ్లీ, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే వున్నారు.

ఇప్పుడు ఒలంపిక్స్‌లో రజత పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో ప్రచార కాంట్రాక్టు కుదుర్చుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఒలంపిక్స్‌కు ముందు ఆమె బ్రాండ్ విలువ రూ.20-30 లక్షల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు రూ.2 కోట్లకు పెరిగిందట.యువతలో సింధు ఇమేజ్ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ ఉత్పత్తులు లేదా సేవలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేందుకు సంస్థలు తహతహలాడుతున్నాయి. ఒలంపిక్స్ తర్వాత ఆమె బ్రాండ్ విలువ ఏకంగా పదిరెట్లు పెరిగి రూ.2 కోట్ల స్థాయికి చేరుకుందని విశ్లేషకులంటున్నారు.