శాతకర్ణి మూవీ వెనుక స్టోరీ చాలా ఉంది

బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే.. ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999ను  బాలయ్య వందో సినిమాగా తీయాల్సి ఉంది. అయితే.. బాలకృష్ణ వందో సినిమా మొదలుపెట్టే సమయానికి.. అదే టైమ్ మెషీన్ కాన్సెప్ట్ పై సూర్య మూవీ 24 దాదాపు పూర్తి కావచ్చింది. ఆరు నెలల గ్యాప్ తో అదే టైపు సినిమా జనాలకు ఎక్కడం కష్టం.

ఇక కృష్ణవంశీ తీస్తానన్న రైతు సబ్జెక్ట్ కూడా బాలయ్యకు విపరీతంగా నచ్చింది. కానీ దీనికి కూడా ఓ ప్రాబ్లెం ఉంది. బాలయ్య వందో సినిమాకి చర్చలు జరుపుతున్న టైమ్‌కి.. చిరు 150గా కత్తి అనౌన్స్ చేయలేదు కానీ.. అప్పటికే ఫిక్స్ అయిపోయింది. కత్తిలో కూడా కథ భూములు.. నీళ్లు అంటూ రైతుల పోరాటం బేస్డ్ గానే సాగుతుంది. పోటీ పడ్డం సంగతి పక్కన పెడితే.. ఒకే సబ్జెక్ట్ తో షార్ట్ టెర్మ్ లో రెండు సినిమాలొస్తే.. ఏదో ఒకటి లాస్ కాక తప్పదు. అందుకే ఈ రెండింటినీ కాదని.. సూపర్ సబ్జెక్ట్‌తో వచ్చిన క్రిష్ కి ఓటేయగా.. అలా గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైంది.

అదీ బాలయ్య వందో సినిమాకి ఫిక్స్ అయిన విధానం.దర్శకుడు క్రిష్‌కి ఈ నెల 8వ తేదీన పెళ్లి కావడంతో.. షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడినా.. సీజీ వర్క్ మాత్రం కొనసాగుతోంది అయితే.. ఈ పీరియాడికల్ మూవీకి బాలయ్య ఎందుకు చేస్తున్నారనే డౌట్ చాలామందికి ఉంది. పైగా.. దీనికంటే ముందే అనుకున్న రెండు ప్రాజెక్టులను కాదని మరీ.. శాతకర్ణికి ఓటేశారు బాలయ్య.