వర్మ – క్రిమినల్‌ నెం.1 స్టోరీ.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మకి మరో సెన్సేషనల్‌ స్టోరీ దొరికింది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ నయీం క్రిమినల్‌ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ నేరచరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వర్మ లాంటి క్రియేటివ్‌ అండ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్స్‌కి మాత్రమే తట్టుతుంది. గతంలో పరిటాల రవి జీవిత్ర చరిత్రతో ‘రక్త చరిత్ర’ను,, వీరప్పన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించి వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ నయీం జీవిత చరిత్రతతో మరోసారి తన క్రియేటివ్‌ టాలెంట్‌ని ప్రదర్శించాలనుకుంటున్నారు.

ఈ సినిమాని మూడు పార్ట్‌లుగా తీయాలనుకుంటున్నాడట వర్మ. ఈ విషయాన్ని తాజాగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టాడు వర్మ. చాలా వరకూ నయీం చరిత్ర గురించి రీసెర్చ్‌ ఇప్పటికే పూర్తి చేశాడని తెలుస్తోంది. నయీంకి సంబంధించి తెర వెనుక, తెరపైన ఉన్న వారందరి పాత్రలను వర్మ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేయనున్నారట. నయీం మాఫియా చరిత్రని క్రిమినల్‌ నెంబర్‌ వన్‌ స్టోరీగా వర్మ అభివర్ణించారు. నిజమే రాజకీయాల్ని సైతం ఓ కుదుపు కుదిపేసేలా నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చివరికి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.