రేజీనాకి ఆ ఒక్కడు మిగిలాడు!

కొత్త హీరోయిన్లు రాక రెజీనాను ప్రభావితం చేసిందనే చెప్పొచ్చు. చిన్న సినిమాలకు పెద్ద కథానాయికగా మారిన ఈ బ్యూటీ హవా తగ్గిపోయింది. ప్రస్తుతం మనోజ్‌ ‘ఒక్కడు మిగిలాడు’లో చేస్తోంది. గతంలో ఈమె మనోజ్ తో శౌర్య సినిమా చేసిన సంగతి తెలిసిందే.

”ఒక్కడు మిగిలాడు”లో.. మనోజ్ ఎల్‌టీటీఈ లీడర్‌గా ఒక పాత్రనూ.. కాలేజ్ స్టూడెంట్‌గా మరో పాత్రలోనూ కనిపిస్తాడట. మనోజ్‌ స్టూడెంట్ రోల్‌కు జోడీగా రెజీనాను సెలక్ట్ చేసుకున్నారట. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. రెజీనా కోలీవుడ్‌లో మాత్రం రెండుమూడు చిత్రాలు అంగీకరించింది.