‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అనకూడదట!

లెజెండ్,కబాలి వంటి సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాల్లో నటించి అందం అభినయంతో అలరించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తాజాగా ‘పర్చెడ్‌’ సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.దక్షిణాదిలో ఎంతో ఒద్దికైనా పాత్రల్లో ఒదిగిపోయిన రాధికా శృగార దృశ్యాలు ఇక్కడి జనాలకి మింగుడుపడడం లేదు.

అయితే రాధికా వివాదానికి సహా నటుడు ఆదిల్‌ హుస్సేన్ నరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చి రాధికకు బాసటగా నిలిచే ప్రయత్నం చేసాడు.అసలు ఈ మొత్తం ఉదంతానికి ‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అని ఎందుకు పేరు పెట్టారు? ఆ శృంగార దృశ్యాల్లో రాధిక తో పాటు ఆదిల్‌ హుస్సేన్ కూడా పాల్గొన్నాడు కదా , అప్పుడు ఆదిల్‌ హుస్సేన్ సెక్స్ సీన్ అని ఎందుకు పిలవడం లేదు అనే సరికొత్త వాదాన్ని తీసుకొచ్చాడు.

అంటే ఆదిల్‌ హుస్సేన్ సెక్స్ సీన్ అంటే ఎవరు చూస్తారని ‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అంటే బాగా పాపులర్ అవుతుందనే ఇలా చేశారు అన్నారు.అయినా అది జగమెరిగిన సత్యమే కదా.మగాడి శృంగార లీలలు అంటే ఎవరు పట్టించుకుంటారు..అదే రాధికా శృంగారం అంటేనే కదా ఇంత రచ్చ జరుగుతోంది.పాపం ఆదిల్‌ హుస్సేన్ ఎంత వాదించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది రావాల్సిన పబ్లిసిటీ కూడా వచ్చేసింది కదా.

ఇంకా ఇప్పుడు పాస్చాత్య దేశాల్లో ఇలాంటి సీన్ లు సినిమాల్లో ఉండటం కామన్..మన దగ్గరే ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు లాంటి వాదన దేనికి చెప్పండి.పాస్చాత్య దేశాల్లో కామన్ కానీ సినిమా ఇండియాలో కదా సర్ రిలీజ్ అయింది.మనమింకా ఇంత భారీ రేంజ్ శృంగారాన్ని అంత లైట్ తీసుకునే రేంజ్ కి ఎదగలేదు లెండి.