రజనీకాంత్‌ బయోపిక్‌ వచ్చేస్తోందిట

రజనీకాంత్‌ బయోపిక్‌ని తెరకెక్కించడానికి ఆయన కుమార్తె ఐశ్వర్య సన్నాహలు చేస్తున్నారు. యంగ్‌ హీరో ధనుష్‌కి భార్య అయిన ఐశ్వర్య, ఇప్పటికే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తన తండ్రి, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి దర్శకత్వం చేయడం రిస్క్‌తో కూడిన వ్యవహారమంటున్నారామె.

చిన్నతనం నుంచీ తాను తన తండ్రిని చూస్తూ పెరిగాననీ, ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలూ, తాను పుట్టకముందు తన తండ్రి సినీ రంగంలో సాధించిన విజయాల్ని తెలుసుకుని, కొంత పరిశోధన చేసి బయోపిక్‌ రూపొందించాలనుకుంటున్నట్లు ఐశ్వర్య చెప్పింది. అతి త్వరలోనే ఈ బయోపిక్‌ని సెట్స్‌ మీదకు తీసుకెళ్ళనుందట ఐశ్వర్య. చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటోందట ఐశ్వర్య. ఇంకో కుమార్తె సౌందర్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశముందని సమాచారమ్‌.

ఇప్పటికే ఇద్దరు అక్కా చెల్లెళ్లు కలిసి ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ గేదర్‌ చేయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ నటించిన ‘కబాలి’ సినిమా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలను అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, రజనీకాంత్‌పై అభిమానానికి ఫ్యాన్స్‌ ఈ సినిమా విజయం సాధించడానికి తగిన కృషి చేస్తూనే ఉన్నారు.