బాలీవుడ్ Vs హృతిక్‌

ఈ శుక్రవారం బాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ ”మొహంజొదారో”, మరొకటి అక్షయ్ కుమార్ ”రుస్తుం’. ఈ రెండింటివీ ఫ్లాష్ బ్యాక్ కథాంశాలే అయినా వేటికవే భిన్నమైన చిత్రాలు. ‘మొహంజొదారో’ పురాతన చారిత్రాత్మక నేపథ్యం ఉన్నదైతే.. ‘రుస్తుం’ ఆధునికయుగంలో సంభవించిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.

ఈ సంగతి పక్కనపెడితే..’రుస్తుం’ కోసం బాలీవుడ్ ఏకమైపోయిందా అనే సందేహం కలుగుతోంది ఇటీవలి పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. అక్షయ్ మూవీ సక్సెస్ సాధించాలంటూ యువహీరో రణ్‌వీర్‌ నుంచి ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌, హీరోయిన్లు వరసపెట్టి వీడియో సందేశాలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే.. హృతిక్‌ కోసం ఇలా.. ఒక్కరు చేసిన పాపాన పోలేదు. ఎందుకిలా అంటే.. బాలీవుడ్‌లో ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తోంది.

కంగనా రనౌత్ విషయంతో హృతిక్ అనుచితంగా రియాక్ట్ అయ్యాడని.. ఈ ఎపిసోడ్‌పై హిందీ సినీ జనాల్లో కాస్త అసంతృప్తి నెలకొందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఈ ‘బ్యాంగ్ బ్యాంగ్’ స్టార్ దగ్గర ప్రస్తావిస్తే.. ప్రమోషన్లు అవసరమైన వారికి ప్రచారం చేస్తే తప్పేముంది అని ఎదురు ప్రశ్నించాడు. అంటే.. తన సినిమా ఆడాలంటే.. మరో హీరో సానుకూలంగా స్పందించాల్సిన అవసరం లేదని.. తన సత్తాపై తనకు నమ్మకముందన్న అర్ధంతో ఈ కామెంట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.