బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న తేజస్వీ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాలీవుడ్ కి పరిచమైన నటి తేజస్వి ఆ సినిమాలో సమంతా వున్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వర్మ కంట్లో పడి ఐస్ క్రీం లో హీరోయిన్ ఛాన్స్ కొట్టే సింది. ఆ సినిమాకి ఓపె నింగ్స్ కూడా తేజస్వి వల్లే వచ్చాయి. అంతలా అం దులో హాట్ హాట్‌గా చేయ డంతో తేజస్వికి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది.

అయితే వరుసగా తనకి హీరోయిన్ అవకాశాలు వస్తాయను కున్న తేజస్వి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో సరిపెట్టుకో వాల్సి వస్తోంది. సినిమాలంటే హీరోయి న్‌గా ఛాన్స్ రావడం లేదు గానీ, తేజస్వికి యూత్ లో వున్న ఫాలోయింగ్‌కి మాత్రం ఏం కొదవలేదు. అందుకే మారుతి రీసెంట్‌గా రోజులు మారాయిలో తేజస్విని హీరోయి న్‌గా తీసుకున్నాడు. అది కూడా ఏవరేజ్ మూవీగానే మిగిలింది.

ఇప్పుడు తనకి యూత్‌లో వున్న క్రేజ్ తో హిట్ కొట్టడానికి విష్ యూ హ్యాపీ బ్రేక్ అప్ సినిమాతో వస్తోంది. ఈ మూవీలో వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్లేకార్డు పట్టుకుని మరీ ఫోజులిస్తోంది ఈ అమ్మడు..మొత్తానికి ఓ రూట్ లోకి వచ్చిన తేజస్వికి ఇకనుంచి హీరోయిన్‌గా వరుస ఛాన్స్‌లు వస్తాయో రావో చూడాలి.