నాని విరహ గీతం

రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు భలే వస్తాయి నానికి అంటూ తన తోటి హీరోలు ఎప్పుడూ అసూయ పడుతూనే ఉంటారు. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలోని మతిమరుపు క్యారెక్టర్‌ అందుకే అంత దగ్గరయ్యింది ప్రేక్షకులికి. ఒక్క భలే భలే మగాడివోయ్‌లోనే కాకుండా, నాని నటించే ప్రతీ పాత్రలోనూ సగటు మనిషి తనకు తాను ఆ పాత్రలో విలీనం అయిపోయి ఎంజాయ్‌ చేసేలానే ఉంటుంది నాని సినిమాలోని ప్రతీ పాత్ర.

అసలే నేచురల్‌ యాక్టింగ్‌, ఇక పాత్ర పరంగా నేచురాలిటీ. ఇవన్నీ నానిని సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెడుతోంది. అందులోనూ, నానికి కథల ఎంపికలో కూడా మంచి టాలెంట్‌ ఉంది. ఆ టాలెంట్‌తోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అలాగే హిట్స్‌ కూడా కొడుతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్‌ హీరో అన్పించుకున్న నాని మరో హ్యాట్రిక్‌ని స్టార్ట్‌ చేసేలా ఉన్నాడు. తాజాగా నాని నటించిన ‘మజ్ను’ సినిమా ఫస్ట్‌ లుక్స్‌, ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు.

విరించి వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి ఇళయరాజా స్వరపరిచిన మెలోడి బీట్స్‌ ప్రధాన ఆకర్షణ. స్టాప్‌ డ్రింకింగ్‌, స్టార్ట్‌ లవింగ్‌ అనే క్రేజీ మెసేజ్‌తో వస్తోన్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల మందుకు రానుంది.