దానికే ఇల్లీకి అంతా కోపమా!

నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు.

అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే చెప్పనే లేదు, అప్పుడే తనపేరును ప్రకిటించడమేంటి?అదీగాక తన వీడియోను కూడా ఆంఖే 2 ఫంక్షన్ లో ప్రదర్శించడం ఆమెకి కోపాన్ని తెప్పించిందట.దీంతో తన పర్మిషన్ లేకుండా ఇలా చేసినందుకు దర్శకనిర్మాతలపై ఇల్లీబేబీ కేసు వేసే ఆలోచనలో ఉందని చెప్పుకుంటున్నారు.