డామిట్ ముత్తయ్య అడ్డం తిరిగాడే!

ఏ జేరూసలెం ముత్తయ్యని తెలంగాణా పోలీసులకి దొరక్కుండా రోజుకో ప్లేస్ మార్చి సినీఫక్కీలో తిప్పిన చంద్రబాబు పైనే అదే ముత్తయ్య తీవ్రమైన ఆరోపణలు చేసాడు.ఓటుకు నోట్లు కేసులో ఆడియో వీడియొ తెలుపులతో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆకేసులో A – 4 నిందితుడుగా ఉన్న ముత్తయ్యని అప్పట్లో చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా తప్పించాడన్నది జగద్విగితం.

అయితే బాబుకు బాగా అలవాటైన వాడుకో వదిలేసుకో గేమ్ మళ్ళీ ప్లే చేసినట్టు కనిపిస్తోంది.ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు ముత్తయ్య అభ్యర్థన మేరకు కేసును 4 వరాలు వాయిదా వేసింది.ఈ సందర్భంగా మత్తయ్య ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు.తనకు ప్రాణ భయం ఉందనీ ,తనకు ప్రాణహాని జరిగితే మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , అలాగే కేసీఆర్ కూడా బాధ్యుడేనని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.అబద్ధం ఆడనని, నిజాన్ని త్వరలో బయటపెడతానని ఆయన తెలిపారు.

నిజమేంటో అందరికి తెలిసిందే అయినా ఆ నిజాన్ని నిందితుడు నిజంగా చెప్తే పరిస్థితేంటా అని అప్పుడే రాజకీయ విశ్లేషకులు ఆరాతీస్తున్నారు.చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారని, నీకేం కాదు..తాను ఉన్నానని చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మత్తయ్య ఆరోపించారు.అయినా అందులో బాబు తప్పేముంది చెప్పండి..ఆయన జీవితమే ఒక తెరచి ఉంచిన పుస్తకం..ఆపుస్తకం లో ఎంత వెతికినా కనిపించే నీతి ఇదే కదా..

అటు చంద్ర బాబు ఇట్లు కెసిఆర్ ప్రభుత్వం తనని ముద్దాయిగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు అయితే జోలపడి నీకేం కాదు.. అని ధైర్యం చెప్పినట్లు నటించారని ఇప్పుడేమో నట్టేట ముంచుతున్నారని,దీనికి ప్రజలే తీర్పు చెప్పాలన్నారు ముత్తయ్య.ప్రజలు తీర్పు చెప్పడానికి ఇంచా చాలా టైం వుంది లే కానీ ఆ నిజమేంటో సుప్రీం కు చెప్పు సుప్రీం చెప్తుంది దిమ్మ తిరిగే తీర్పు.