ట్రంప్ భార్య నగ్న ఫొటోలివిగో

అమెరికాలో కూడా రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదివరకెన్నడూ చూడని వింతలు చోటుచేసుకుంటోంటే ప్రపంచం నివ్వెరపోతోంది. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్య్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన బిలియనీర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కి అతని భార్య న్యూడ్‌ ఫొటోలు ఇబ్బందిగా మారాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా కొన్నేళ్ళ క్రితం మోడల్‌గా పనిచేశారు.

మనదేశంలోనే మోడలింగ్‌ అంటే చాలీచాలని దుస్తుల్లో కనిపిస్తుంటారు. విదేశాల్లో అయితే మోడలింగ్‌ అనగానే నగ్నత్వం గుర్తుకొస్తుంది. మెలానియా కూడా మోడలింగ్‌ చేసే రోజుల్లో నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చి ఇప్పుడు బుక్కయిపోయారు. న్యూయార్క్‌ పోస్ట్‌ ఆనాటి ఫొటోల్ని కవర్‌పేజ్‌గా ప్రచురించడంతో ట్రంప్‌ వర్గీయులు షాక్‌కి గురయ్యారు. అయితే ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ జిమ్మిక్స్‌ తనను ఏమీ చేయలేవని ట్రంప్‌ అంటున్నారట.

ఇండియాలో అంటే ఇది షాకింగ్‌గానీ, అమెరికా లాంటి దేశాల్లో ఇది మామూలు వ్యవహారంగా ఇంకొందరు కొట్టిపారేయడం జరుగుతోంది. 1998లో మెలానియా ట్రంప్‌ని తొలిసారిగా కలిశారు. అప్పటికే ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇది కూడా అమెరికాలో మామూలే. మెలినియా, ట్రంప్‌కి మూడో భార్య. మెలియానా అందమైన మహిళ అనీ ఆ ఫొటోలతో తాము ఏమీ ఇబ్బంది పడటంలేదని ట్రంప్‌ సలహాదారు జాసన్‌ మిల్లర్‌ చెప్పారు.