గ్యారేజ్ ఓవర్శిస్ లో న్యూ రికార్డు!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, జ‌న‌తా గ్యారేజ్‌’. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో విపరీతమయిన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాయి.

జ‌న‌తా గ్యారేజ్‌’ ఎన్టీఆర్ కెరియర్ లోనే హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్‌తో పాటు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంద‌ని అంద‌రూ అంచనాతో ఉన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఓవర్శిస్ లో 3 మిలియ‌న్ డాల్లర్లతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇంతకముందు ఎన్టీఆర్ సినిమాలు ‘టెంప‌ర్’ సినిమా 1 మిలియ‌న్‌కు పైగా, ‘నాన్న‌కు ప్రేమ‌తో’ 2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేశాయి.

ఇప్పుడు ‘జ‌న‌తా గ్యారేజ్’ కచ్చితంగా 3 మిలియ‌న్ డాల‌ర్ల‌పైనే వ‌సూలు చేస్తుంద‌నే భావిస్తున్నారు. ఈ అంచనాతోనే ఈ సారి అమెరికాలో జనతా గ్యారేజ్ 200 స్క్రీన్స్ లో ప్రదర్శిస్తున్నారు. పెద్దఎత్తున ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నారట. ఇక అర‌బ్ కంట్రీస్‌లో కూడా గ్యారేజ్ బాహుబ‌లిని మించి 48 స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారట.