గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అనూహ్యంగా ఎంపికయ్యారు. చివరి క్షణం వరకు నితిన్ భాయ్ పటేల్ అవుతారని ప్రచారం జరిగినా…పార్టీ కేంద్ర పరిశీలక బృదం రూపానీనే ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ్యులతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేశ్ పాండేలతో కూడిన పరిశీలక బృందం చర్చించింది.

మెజార్టీ సభ్యులు రూపానీ నాయకత్వం వైపే మొగ్గుచూపారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ ఎంపిక చేస్తారనే ప్రచారం ఇవాళ్టితో ముగిసిపోయింది. జైన్ అయిన విజయ్ ఒకప్పుడు టీచర్ గా పని చేశారు.  ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలంగా ఉండే వాళ్లు. ఈ ట్విస్టును నితిన్ పటేల్ కూడా ఊహించలేక పోయారు.

అయితే ఈయన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించారు. నితిన్ కు ఆశాభంగం జరగడం ఇది రెండో సారి. 2014లో మోడీ ప్రధాని అయ్యాక  కూడా ఆయన సీఎం పదవి పోటీ పడ్డారు. ఆనందీబెన్ రాజీనామాతో బీజేపీలో కొత్త నేత ఎంపిక అనివార్యమైంది.