కొడుకుల వివాహాలపై నాగ్ క్లారిటీ

ఈమధ్య కాలం లో ఎక్కడ చుసిన నాగార్జున కొడుకుల వివాహం గురించే మాట్లాడుతున్నారు. అందులోనూ నాగచైతన్య , సమంతల పెళ్లి గురించి అయితే రోజుకొక గాసిప్ వినిపిస్తూవుంది. ఇదిలావుంటే మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి గురించి కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఈ రెండు పెళ్లిళ్ల పై అనేక రూమర్స్ వచ్చాయి అయితే నాగార్జున ఈ రెండు పెళ్లిళ్ల పై ఒక క్లారిటీ ఇచ్చేసారు.

ఈ నెల 29న ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తన కుమారులైన నాగ చైతన్య, అఖిల్ ల వివాహానికి సంబంధించిన విశేషాలు మీడియాకు పంచుకున్నారు. ‘నాగచైతన్య, అఖిల్ వారి సోల్మేట్స్ను ఎంచుకున్నారు. ఇక కెరీర్ పరంగా ఎవరి దారిలో వారు వ్యక్తిగతంగా ముందుకు వెళుతున్నారు. అఖిల్ మాత్రం ఇంకా తాము ఆశించిన మార్క్ అందుకోలేదు. అందుకే రెండో చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నారట. మరో నెలలో ఆ చిత్రంపై ప్రకటన ఉండబోతోందని చెప్పారు. వాళ్లిద్దరి వివాహాలు ఒకేసారి, ఒకే వేదికపై చేయడం లేదు. ఎందుకంటే ఆ రెండు పెళ్లిల్ల ద్వారా వచ్చే ఆనందం నేను పూర్తిగా ఆస్వాధించాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.