కాశ్మీర్ ఉగ్రవాది పాక్ లో హీరో

భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ టెర్రరిస్ట్  బుర్హాన్‌ వనీ.. హీరోలా చూస్తోంది పాకిస్థాన్. ఇండియా ఎంత చెబుతున్నా వినకుండా.. వనీ విషయంలో కలగచేసుకుంటోంది. అతను యువతకి స్ఫూర్తి అంటూ.. ప్రచారం చేస్తోంది. గురువారం ‘ఆజాదీ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ఓ రైలును ప్రారంభిస్తోంది పాకిస్థాన్.

ఈ రైలు బోగీలపై వనీ ఫొటోలను అంటించింది. వనీతోపాటు కాశ్మీర్‌లో హింస బాధితుల ఫొటోలనూ రైలు బోగీలకు అంటించింది. ఈ రైలును పాక్‌ రైల్వే మంత్రి ఖాజా సాద్‌ రఫీ గురువారం ప్రారంభించనున్నారు. ఇది కయ్యానికి కాలుదువ్వే చర్యేనని చెబుతున్నారు