ఎన్టీఆర్‌ రికార్డ్‌ – 30వేల ఫోటోలు

ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి విడుదలకు ముందే అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని తిలకించిన వారి సంఖ్య సామాజిక మాధ్యమంలో ఒక రికార్డయ్యింది. తాజాగా మరో రికార్డు తోడయ్యింది.

ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్‌ దిగిన ఫోటోలు 30వేలకు చేరాయి. ‘జనతా గ్యారేజ్‌’ సెట్‌లో ఎన్టీఆర్‌ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో జూనియర్‌ కాదనకుండా ఫోటోలు దిగాడట. ఫ్యాన్స్‌తోనే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్‌తో కూడా ఎన్టీఆర్‌ ఫోటోలు దిగాడు. ఇలా దిగిన ఫోటోలన్నీ కలిపితే అవి 30వేలకు చేరాయి. ఇది అరుదైన రికార్డు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం మించకుండా ఉండాలనే రిలీజ్‌ని మరి కొన్ని రోజుల వాయిదా వేసుకుని షూటింగ్‌ని పొడిగించింది చిత్ర యూనిట్‌.

ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మీద మరికొన్ని అద్బుతమైన ప్రయోగాలు చేయనున్నాడట డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఎన్టీఆర్‌ అదిరిపోయే డైలాగులు, యాక్షన్‌తో దుమ్ము లేపుతున్నాడు. మళయాళ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిత్యామీనన్‌, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏదేమైనా ‘జనతాగ్యారేజ్‌’ మేకింగ్‌లో 30 వేల మందితో ఎన్టీయార్‌ ఫొటోలు దిగడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.