ఎన్టీఆర్ ని అలా ఎప్పుడూ చూసుండరు

నటనలో ఎన్టీయార్‌ది కొత్త స్టైల్‌. మాస్‌ అప్పీల్‌ ఉన్న హీరో ఎన్టీయార్‌. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఎన్టీయార్‌లోని కొత్త యాంగిల్‌ బయటికి వచ్చిందట. అయితే గతంలో ‘టెంపర్‌’, నాన్నకు ప్రేమతో’ సినిమాలతోనే ఎన్టీయార్‌ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఈ సినిమాలో కొరటాల మరో కొత్త యాంగిల్‌ని ఎన్టీఆర్‌ నుండి రాబట్టాడట. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ ప్రత్యక్షంగా చెబుతోంది.

ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది నిత్యామీనన్‌. ఈ ముద్దుగుమ్మ ఎన్టీయార్‌ నటనకు ఫిదా అయిపోయిందట. అసలే నిత్యా మంచి నటి. అలాంటిది ఆమెకే ఎంతో ఆశక్తికరంగా అనిపించిందట ఈ సినిమాలో ఎన్టీయార్‌ నటన. ఇంతవరకూ ఏ సినిమాలోనూ ఆయనలోని లేని యాంగిల్‌ ఈ సినిమాలో చూడొచ్చు అంటోంది. అంతేకాదు వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాల చిత్రీకరణ సినిమాలో హైలైట్‌ కానుందట.

ఎలాంటి పాత్రైనా అవలీలగా చేయగలిగే కెపాసిటీ ఉంది నిత్యాకి. ఈ సినిమాలో తనది సెకండ్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌ అయినప్పటికీ చాలా ప్రాధాన్యత ఉంటుందట ఆ పాత్రకి. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీయార్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.