ఆది కన్నడ సినిమా పక్కా.

తెలుగు సినిమాల్లో డైలాగ్‌ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్‌ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్‌. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్‌ హీరోని చెయ్యాలని తలంచాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఆది హీరోగా నటించే సినిమా త్వరలో ప్రారంభం కానుందని సమాచారమ్‌.

ఓ కన్నడ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సాయికుమార్‌ నిర్మాతగా ఈ చిత్రం ఉంటుందట. ఓ ప్రముఖ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఫేం మెహరీన్‌ కౌర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశముందని కూడా అంటున్నారు. సాయికుమార్‌తో పాటు ఆయన తమ్ముడు రవిశంకర్‌ కూడా కన్నడలో మంచి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. పలు సినిమాల్లో కూడా నటించాడు. . సో ఈ ఫ్యామిలీకి ఇలా కన్నడ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇక ఆదికి కూడా ఈ సినిమా బిగ్‌ బిగినింగ్‌ కానుంది. ప్రస్తుతం తెలుగులో తాజాగా విడుదలైన ‘చుట్టాలబ్బాయ్‌’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఆల్‌ ది బెస్ట్‌ ఆది టు కన్నడ ఎంట్రీ.