హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం

ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి.

అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా కబాలి రిలీజ్ క్లారిటీ లేకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.దానికి తోడు NTR జనతా గారేజ్ ముందుగా ఆగస్ట్-12 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో బాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది.

అయితే తాజాగా కబాలి జులై-22 కన్ఫర్మ్ అయింది,జనతా గారేజ్ సెప్టెంబర్-2 కు వాయిదా పడింది.దీంతో ఈ రెండిటికి మధ్యలో అయితే ఎటువంటి సమస్య రాదని ఆగస్ట్-12 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.రిలీజ్ కి మార్గం సుగమం చేసుకున్న బంగారం ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తాడో చూడాల్సిందే.