షారూఖ్ కి సన్నీ చిక్కులు!

బాలీవుడ్ స్టార్ హీరోలు – స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది సన్నీ లియోన్. ఆమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోనే.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం..బాలీవుడ్ బాద్ షా తన సినిమా ‘రయీస్’లో ఆమెకు ఐటం సాంగ్ ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణలు.

సన్నీతో ఐటెం సాంగ్ చేయించడం ‘రయీస్‌’కు కలిసివచ్చే అంశమని షారుక్‌తో పాటూ చిత్రబృందమూ విశ్వసిస్తోంది. ఇక ఈ పాటలో గ్లామర్‌ డోస్‌ విపరీతంగా ఉన్నట్లు టాక్. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడీ పాటతోనే కింగ్‌ఖాన్‌కు సమస్య వచ్చిపడింది. ఈ పాట పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ కత్తెరకు బలైనట్లు తెలుస్తోంది.

భారత్‌లోలానే పాకిస్తాన్‌లోనూ మన సినిమాలు విడుదలై అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాయి. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ పిక్చర్ రయూస్ ను కూడా అక్కడ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాద్ షా. అయితే పాక్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ సినిమా విడుదల చేసేందుకు నిరాకరించిందట. సన్నీ ఆడిపాడిన పాటని పూర్తిగా తొలగిస్తే తప్ప తమ దేశంలో ఈ సినిమా విడుదలకి ఒప్పుకోం అని తేల్చి చెప్పిందట. బోర్డు ఆదేశాలతో పాక్ ప్రేక్షకులు కాస్త అసహనానికి లోనయ్యారని వార్తలొస్తున్నాయి. మరోపక్క, సినిమా విడుదలకు ఐదు నెలల సమయం ఉంది. దీంతో సన్నీ పాటపై పాక్ సెన్సార్ బోర్డు ఇప్పుడే ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందంటున్నారు కొందరు.