వినాయక్ మళ్ళీ మెగా క్యాంప్ లోనే

వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగు జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో చరణ్ తరచూ సెట్స్‌కు వస్తున్నాడు. దర్శకుడు వినాయక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మరోసారి ఒక సినిమా చేయాలన్న నిర్ణానికి వచ్చారని అంటున్నారు.

గతంలో వినాయక్-చరణ్ కాంబినేషన్‌లో ‘నాయక్’ సినిమా వచ్చింది. ఈ పిక్చర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సక్సెస్‌ను మరోసారి రిపీట్ చేయాలని ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. చిరుకి ‘ఠాగూర్’ లాంటి హిట్ ఇచ్చిన వినాయక్, ఆయన 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చరణ్‌తోనూ ఈ ట్రెడిషన్‌ కంటిన్యూ చేస్తే మెగా అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.