వర్ణించ తరమా ఈమె అందం!!

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో విజయం కోసం తహతహలాడుతోంది.అక్షయ్ కుమార్ హీరోగా ఆగస్ట్ 12 న విడుదలవనున్న రుస్తుం సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటోంది ఈ స్లిమ్ బ్యూటీ.

ఈ మధ్యనే రిలీస్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.ముక్యంగా అందులో ఈ ముద్దుగుమ్మ నటనని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో ఆస్ట్రేలియా లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది ఈ చిన్నది.స్వతహాగా ఫొటోగ్రాపర్ అయిన ఆండ్రూ ఇలియానా అందాల్ని మరింత అందంగా తన కెమెరాలో బందిచాడు.ఆ ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇలియానా.ఇంకేముంది సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఈ చిన్నదాని ఫోటో.కుర్రకారుని కట్టిపడేస్తుంది ఇలియానా ఈ రకంగా.