లక్ష కావాలా?సినిమా నచ్చకపోతే చాలు!

పబ్లిసిటీ లో సినిమా పబ్లిసిటీ వేరయా..ప్రచారం కోసం సినిమా వాళ్ళు రక రకాల పాట్లు పడుతుంటారు.సినిమా రిలీజ్ కి ముందే ఎదో ఒక వివాదం రాజేయడం తద్వారా ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం.ఈ తరహా ప్రచారానికి రాంగోపాల్ వర్మ కర్త కర్మ క్రియ అన్ని.ఇదే కాదు రూమర్స్ అని ఫీలర్లు అని ఇలా ఒకటా రెండా ప్రచారానికి సవాలక్ష మార్గాలు సినిమాలకి ఈ రోజుల్లో.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అనుకుంటున్నారా?ఏమి లేదు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ ఒకటి మనముందుకొచ్చింది.‘స్నేహమా… ప్రేమా… ఆకర్షణా..?’ అన్న ట్యాగ్‌లైన్‌తో బి.ఆర్‌.యస్‌.ఐ.మూవీస్‌ పతాకంపై పోల్కంపల్లి నరేందర్‌ నిర్మిస్తున్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్’.ఈ సినిమా చూసినవారెవరైనా తమకు నచ్చలేదని సహేతుకంగా వివరిస్తే.. లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని దర్శకనిర్మాతలు సమావేశంలో ప్రకటించారు.

గోపినాథ్ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా కబాలి రిలీస్ తరువాత రోజు అంటే జులై 23 న విడుదల కానుంది.అయితే నిజంగా లక్ష ఇస్తారా సినిమా నచ్చక పోతే అని అడక్కండి.ఎందుకంటే ‘సహేతుకంగా’ నచ్చలేదని వివరించాలంట వీరికి..అంటే మనకు నచ్చకపోవడం అనేదాన్ని వాళ్ళు అంగీకరిస్తేనే లక్ష మనకు దక్కుతుంది.అయినా మనకు నచ్చక పోవడం పెద్ద మేటర్ కాదు కానీ..మనకు నచ్చలేదన్న మేటర్ దర్శక నిర్మాతలకి ఎప్పటికి నచ్చాలి, మనకు ఎప్పటికి లక్ష రూపాయలివ్వాలి!అంతా సినీ మాయ.