రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?

ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్‌ గాంధీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు వేశారు. రాహుల్‌ పెళ్ళి చేసుకోవడం, సూర్యుడు పశ్చిమాన ఉదయించడం రెండూ ఒకటేనని ట్వీట్‌ చేశారాయన. సుబ్రమణ్యస్వామి ట్వీట్లతో కాంగ్రెస్‌ షాక్‌ అయ్యింది. రాహుల్‌ పెళ్ళి అతని వ్యక్తిగత విషయం గనుక స్వామి ఇలాంటి ట్వీట్లు వేయడం సబబు కాదని కాంగ్రెసు నాయకులు ఆక్షేపించారు.

స్వామి అన్నారని కాదుగానీ ఇదివరకట్లో రాహుల్‌గాంధీకి ఓ యువతితో పరిచయం ఉండేది. ఆమె రాహుల్‌తో కలిసి చాలా సార్లు మీడియా కెమెరాలకు చిక్కింది. సోనియా జోక్యంతో రాహుల్‌ ఆ బంధం చెడగొట్టుకున్నారని అంటారు. ఏదేమైనా స్వామి ట్వీట్లతో రాహుల్‌కి పెళ్ళి మీద మనసు పడొచ్చు. అలాగైతే స్వామి పరోక్షంగా రాహుల్‌ పెళ్ళికి కారకుడవుతారు. రాహుల్‌ తాను పడమర ఉదయించే సూర్యుడిని కాదని, తూర్పున ఉదయించే సూర్యుడనని నిరూపించుకుంటారా? స్వామి మాటల్ని నిజం చేస్తారా?