రష్మీ తో ధనరాజ్ నిజమేనా?

సినిమాల్లో కమెడియన్‌గా ధన్‌రాజ్‌ ఎప్పట్నుంచో కనిపిస్తూనే ఉన్నాడు. బక్క పలచని బాడీతో, తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈటీవీ ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయిపోయడు ధన్‌రాజ్‌. అదీ కూడా కమెడిన్‌గా కాకుండా, ఏకంగా ఆ తరువాత హీరో అయిపోయాడు కూడా.

హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు. అవి హిట్‌ అయ్యాయా లేదా అనే సంగతి పక్కన పెడితే, తాజాగా ఈ కమెడియన్‌ కమ్‌ హీరో ప్రొడ్యూసర్‌గా కూడా అవతారమెత్తాడు. ‘ధనలక్ష్మీ తలుపు తడితే’ అనే సినిమాతో ధన్‌రాజ్‌ ప్రొడ్యూసర్‌గా మారాడు. అయితే ఆ సినిమా ధన్‌రాజ్‌కి నష్టాలే మిగిల్చింది. అయినప్పటికీ వెనకాడకుండా ధన్‌రాజ్‌ మళ్లీ మరో సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట.

ఈ సినిమాలో హీరోయిన్‌గా రేష్మీని ఎంచుకున్నాడట. అంతేకాదు ‘జబర్దస్త్‌’ పాత టీం అంతా ఈ సినిమాలో సందడి చేయనున్నారట. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే స్టోరీని ఈ జబర్ధస్త్‌ టీం అంతా కలిసికట్టుగా కూర్చుని రూపొందించారని సమాచారం. ఒక్కొక్కరుగా స్కిట్‌ చేస్తేనే నవ్వుల వర్షం కురిపించే టాలెంటెడ్స్‌ ఈ జబర్దస్త్‌ హీరోస్‌. అలాంటిది అందరూ కలిసి రూపొందించే స్కిట్‌, సోరీ సోరీ ఏకంగా సినిమా కథ. ఇంకెలా ఉంటుంది. ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం ద్వారా ఇంటింటికీ సుపరిచితులైన ఈ జబర్ధస్త్‌ టీం ప్రేక్షకుల అంచానలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇంతవరకూ థ్రిల్లర్‌ మూవీస్‌కి పెట్టింది పేరుగా నిలిచిన గ్లామర్‌ డాళ్‌ రేష్మీ ఈ సినిమాలో పూర్తి కామెడీ రోల్‌లో నటించనుందట. ఆల్‌ ది బెస్ట్‌ ధన్‌రాజ్‌ అండ్‌ టీం.