రకుల్‌ స్మైల్‌ సీక్రెట్‌ అదేనట

అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది. ఆమె చిన్నగా ఒక నవ్వు విసిరితే చాలు ఎంతటివారైనా ఆమె నవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. ఆమె ఎవరో కాదు స్మైలీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఎందుకిలా అంటే తనకి మనసులో ఏదో దాచుకుని పైకి నవ్వుతూ ఉండడం ఇష్టం కాదంటోంది. తన మనసులో ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుందట. దాంతో తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ముఖంలో కళ కూడా అంతే స్వఛ్చంగా ఉంటుంది. అందుకే తన నవ్వు అంత హాయిగా ఉంటుందంటోంది. ఎవ్వరికైనా ఈ ముద్దుగుమ్మ ఇదే సలహా ఇస్తుందట.

ఎంత ఒత్తిడి ఉన్నా, టేకిట్‌ ఈజీ మేనర్‌తో ముందుకెళితే ఆరోగ్యంగా ఉంటామనీ, ఆరోగ్యంగా ఉంటే ఆటోమెటిగ్గా ఒత్తిడిని జయించే ఎనర్జీని పొందగలమనీ అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బావుందే ఈ హెల్త్‌ అండ్‌ స్మైల్‌ సీక్రెట్‌. మరింకేం ముద్దుగుమ్మ రకుల్‌ ఇంత ముద్దుగా చెప్పినాక ఫాలో కాకుండా ఉండగలమా. ఈ బ్యూటిఫుల్‌ స్మైల్‌ బ్యూటీ ప్రస్తుతం చాలా బిజీ. ఊపిరి సలపనంత బిజీగా సినిమాలు చేస్తోంది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. తాజాగా ‘సరైనోడు’తో హిట్‌ కొట్టి, చరణ్‌తో హిట్‌ కొట్టడానికి రెఢీ అయిపోతోంది. మరో మెగా హీరో సాయిధరమ్‌తో కూడా సినిమా లైనులో ఉంది. పవన్‌ కళ్యాణ్‌తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది రకుల్‌. మహేష్‌ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌గా ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది.