మేనమామ చేతికి చైతు కథ!

అక్కినేని వారసుడిగా 2010 లో తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య ని చూసి అందరు చైతు టాప్ హీరో అవడానికి ఎంతో టైం పట్టదనుకున్నారు.కానీ చైతు కెరీర్ లో హిట్లు ప్లాప్ లు రెండు ఉన్నా ఎందుకనో టాప్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు ఈ అక్కినేని వారసుడు.మంచి హీరో దగ్గరే ఆగిపోయాడు..మాస్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు చైతు.

2010లో వచ్చిన జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన చైతు కేరీర్ పరంగా ఇంకా స్టార్ స్టేటస్ అందుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా చైతుకు సరైన హిట్ పడలేదు. ఇప్పటి వరకు ఎక్కువగా బయట బ్యానర్లలోనే సినిమాలు చేసాడు చైతు.దీనికి కారణాలను పక్కన పెడితే సొంత సినిమాలు చేస్తే స్టార్ స్టేటస్ కి తగ్గ కథలు, కాస్టింగ్, ఇంకొన్ని అదనపు హంగులు కల్పించే వెసులుబాటు ఉంటుంది.మిగిలిన వారసులూ ఇదే పంథాలో నడుస్తున్నారు.ఇమేజ్ డామేజ్ అవుతోంది అంటే చాలు ఓన్ బ్యానర్ లో ఓ సినిమా చేసేయడం బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తున్నారు.

ఈ కారణంతోనో లేక తమ బ్యానర్‌లో ఎప్పుడూ నటించలేదన్న భావనతోనే మేనల్లుడుతో సినిమా చేసేందుకు డి.సురేష్ ఉత్సాహంగా ఉన్నారు. తమ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో చైతులో ఓ మూవీ తీయనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. మేనమామ చేతిలో పడితే చైతూకి స్టార్ స్టేటస్ వస్తుందేమో చూడాలి మరీ.